VZM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి సూచించారు. నిన్న ‘ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీమ్’ కింద వేపాడకి చెందిన ముగ్గురికి రూ.1.05 లక్షల సబ్సిడీతో రూ.3 లక్షల విలువైన ఆటోలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కూటమి కృషి చేస్తుందని అన్నారు.