ELR: వేలేరుపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇవాళ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ జనవాణి ‘ కార్యక్రమం జనసందోహంతో కిక్కిరిసింది. మండల వ్యాప్తంగా వచ్చిన సమస్యలను ప్రత్యక్ష వేదికపై స్వీకరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రతి ఫిర్యాదుదారుని వ్యక్తిగతంగా కలుసుకుని వినిపించిన సమస్యలకు తక్షణ పరిష్కారం చేపట్టనున్నట్లు తెలిపారు.