ATP: తాడిపత్రిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామిని ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్దారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక శోభతో ఆలయం మెరిసిపోయింది.