మెదక్: బనగానపల్లె మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటిలో శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మవార్లకు మంగళవారం ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రాతఃకాల సమయంలోనే స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు తదితర పూజ కైంకర్యాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అదే విధంగా స్వామి అమ్మవార్లను విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.