BPT: సంతమాగులూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా తెల్లప్రోలు రమేష్ నియమితులైన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సోమవారం సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారులు ప్రజాప్రతినిధులు రమేష్‌ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.