CTR: హైందవ శంఖారావంకు మద్దతుగా మదనపల్లెలో హిందువులు ఆదివారం భారీ రాలీ నిర్వహించారు. విజయవాడలో జనవరి 5న దేవాలయాల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో జరిగే హైందవ శంఖరావం మహాసభకు సంఘీభావంగా మదనపల్లె నుంచి హిందువులు ఈ రాలీ నిర్వహించి విజయవాడకు బయలుదేరి వెళ్లారు.