NDL: ప్రకృతిలో వస్తున్న మార్పుల కారణంగా ఒక్కోసారి సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంటుంది. అలాంటిది సోమవారం ఉదయం వేళ మంచు కప్పి వేయడంతో సూర్యుడు మంచు తెరల్ని చీల్చుకుంటూ తన ఎర్రని వర్ణంతో ప్రకృతికి వెలుగుని ప్రసాదిస్తున్నట్లుగా అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఒకవైపు చలికి వనికి పోతున్న జీవరాశికి నులివెచ్చని కిరణాలతో చైతన్యం కలిగిస్తున్నట్లుగా కనిపించింది.