KRNL: జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నేడు నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ తెలిపారు. నేటి నుంచి పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు.