PPM: ఫెన్సింగ్ అండర్ -14 స్కూల్ గేమ్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు జియ్యమ్మవలస మండలం పెదమేరంగి తిరుమల సాయి విద్యానికేతన్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి నిమ్మల జితేంద్ర ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలకు రైన్ బో ఉన్నత పాఠశాల, నెల్లూరు జిల్లాలో పాల్గొననున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 09 నుంచి 11వ తేదీ వరకు పోటీలు నిర్వహించనున్నారు.