ప్రకాశం: కందుకూరు ప్రాంతానికి చెందిన విద్యుత్ మీటర్ల రీడర్స్ యూనియన్ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే స్మార్ట్ మీటర్ల వలన రాష్ట్రంలో మీటర్ రీడింగ్ విధులు నిర్వహించే 4,500 మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.