ప్రకాశం: మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు అన్నారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్కాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ఇచ్చిన హామీలను జగన్ అమలు చేశారన్నారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.