CTR: కలగంధ గ్రామం ఎస్సీ కాలనీలో రోడ్లు, సైడ్ కాలువ సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. అనేకసార్లు గ్రామపంచాయతీ అధికారులకు విన్నవించినా ప్రయోజనంలేకుండా పోయిందని వాపోయారు. ఈ కాలనీలో రోడ్లు బురదమయం కావడంతో చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఇకనైన అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.