KRNL: కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో శ్రీ బంగారమ్మ అవ్వ మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా TDP రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయనకు శాలువా, పూలమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.