VSP: దీపం-2 పథకానికి అద్భుతమైన ప్రజా స్పందన వస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ‘X’ వేదికగా పేర్కొన్నారు. సూపర్-6 హామీల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసినట్లు తెలిపారు. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి 5,17,383 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.41.17 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం జమ చేసినట్లు వివరించారు.