ATP: సీనియర్ న్యాయవాది వాల్మీకి శేషాద్రి అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి ముందు న్యాయవాది కుటుంబీకులతో కలిసి ధర్నా చేపట్టారు. సాకే హరి మాట్లాడుతూ.. న్యాయవాది శేషాద్రి మృతి అనుమానాలకు తావిస్తోందని, విచారణ చేపటట్టి చర్యలు తీసుకోవాలన్నారు.