NDL: అవుకు మండలంలోని విద్యార్థులు ఆధార్ స్పెషల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో వెంగన్న తెలిపారు. అవుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపును నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఆధార్ స్పెషల్ క్యాంపుకు హాజరై తమ ఆధార్ కార్డుల్లోని తప్పులు, అన్ని రకాల మార్పులను సరిదిద్దుకోవాలని తెలిపారు.