TPT: గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్ను మంగళవారం గూడూరు డీఎస్పీ వీవీ రమణ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం స్టేషన్లో క్రైమ్ రేట్ గురించి ఆరా తీశారు. పోలీసులు న్యాయం కోసం వచ్చే బాధితులతో ఫ్రెండ్లీ పోలీసులుగా ఉండాలని సూచించారు.