KKD: సామర్లకోట మండలంలో వేట్లపాలెంలో జరిగిన హత్యల నేపథ్యంలో ఆదివారం పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు, కాకినాడ ఆర్డీవో మల్లిబాబు పర్యటించారు. వేట్లపాలెం గ్రామంలో ఎస్సీపేటలో ఇరువర్గాలకు చెందిన నివాస ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతోనూ మాట్లాడారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, సంబంధితులు అందరిపై కేసులు పెట్టామని, చట్టప్రకారం చర్యలు తప్పక తీసుకుంటామని చెప్పారు.