ATP: గుత్తి పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, నగరేశ్వర స్వామి శివాలయాలలో సోమవారం శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు శివలింగానికి పూర్వక రుద్రాభిషేకం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివలింగానికి వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.