ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీలోపు పన్నులు చెల్లించిన వారికి పన్నులో 5 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.