ELR: దీపావళి సందర్భంగా బాణాసంచా తయారీ కేంద్రాలు, షాపులకు అనుమతులు తప్పనిసరి అని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బుధవారం తెలిపారు. లైసెన్స్, నివాస ప్రాంతాలకు దూరం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. అనుమతి లేకుండా విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ విక్రయాలను తెలియజేయాలని కోరారు.