KRNL: ఆదోని నుంచి డణాపురం మీదుగా నానాపురం గ్రామం వద్ద రోడ్డుకు ఇరువైపులా ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక, ఇటీవల ఓ వ్యక్తి మరణించాడని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి మలుపు వద్ద ప్రమాదకరంగా ముళ్లపొదలను తొలగించాలని కోరుతున్నారు.