NLR: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇళ్ళు మంజూరు చేసేందుకు సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ద్వారా సర్వే నిర్వహిస్తుందని ఎంపీడీవో శ్రీహరి తెలిపారు. ఆయన బుచ్చి ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ సహాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలోని సొంత ఇళ్ళు లేని వారి వివరాలు యాప్ ద్వారా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సేకరించాలని తెలిపారు.