MDK: న్యాయ సేవాధికార సంస్థ మెదక్ స్టెనో, టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 23వ తేదీ వరకు ఉన్న దరఖాస్తుల గడువును 29వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద తెలిపారు. రిజిస్టర్ పోస్టు, కొరియర్ ద్వారా మెదక్‌లోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అందించాలన్నారు.