E.G: గోకవరం మండలం కామరాజుపేటలో కోడిపందాలు ఆడుతున్న వారిపై దాడి చేసి పట్టుకున్నట్లు SI పవన్ కుమార్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కోడిపందాలు ఆడుతున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురుని అరెస్ట్ చేసి, రెండు కోడి పుంజులు, 13 కోడి కత్తులను స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.