సత్యసాయి: మంత్రి సవిత రేపు పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్లో జలహారతి కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామంలో కొల్హాపూరి మహాలక్ష్మి అమ్మవారి రథోత్సవంలో పాల్గొంటారని సిబ్బంది తెలిపారు.