TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో తమ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారని మాజీ ఎంపీ వినోద్ తెలిపారు. ఉన్నమాటే చెబుతున్నానని.. దీనిలో దాపరికం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంలో తాము పాల్గొనలేదని.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని చెప్పారు. కులగణన నుంచి తప్పించుకోవడానికే కేంద్రం జనగణన చేయడం లేదని విమర్శించారు.