GNTR: నగరంలోని చేపట్టిన అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవీ ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గంలో రహదారులు, డ్రైనేజీ అభివృద్ది పనులకు మాధవీ ఇవాళ శంకుస్థాపన చేశారు. దశల వారీగా పశ్చిమ నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలన్నారు.