VSP: ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు విశాఖలో న్యాయ అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంపెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. 1987 న్యాయ సేవాధికార చట్టం ప్రకారం బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ సదస్సులో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.