KRNL: మద్దికేర మండలం పెరవలి గ్రామంలోని శ్రీభూదేవి – శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథస్వామి ఆలయ అభివృద్ధికి ఆదోనికి చెందిన గొల్ల రంగన్న-షర్మిల దంపతులు ఇవాళ రూ.20,205 విరాళం అందించారు. అనంతరం వారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ప్రధాన అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలని ఈవో రెబ్బా వీరయ్య తెలిపారు.