KRNL: పోలియో వచ్చి రెండు కాళ్లూ పొతే కూడా పరీక్షించి, ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసే వైద్యులకు వికలత్వం కనిపించిదా అని వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బీసీ సోమన్న ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసులు, తాలూకా అధ్యక్షుడు కె.రామాంజినేయులు, వికలాంగులతో కలిసి ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి, న్యాయం చేయాలని కోరారు.