NZB: ఆర్మూర్ పట్టణంలో గురువారం ACB దాడులు కలకలం సృష్టించాయి. మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఎంవీఐ కార్యాలయానికి వచ్చిన ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి 25 వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.