SRD: ప్రతి గ్రామ పంచాయతీలో పనుల జాతర కార్యక్రమాన్ని విధిగా ప్రారంభించాలని MPDO సత్తయ్య అన్నారు. గురువారం కొండాపూర్ మండలంలో పనుల జాతరపై పంచాయతీ కార్యదర్శులు, విజయ సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి చేపట్టదలచిన పనుల జాతర ప్రక్రియపై గ్రామాల్లో ప్రజలకు తెలిసేలా చాటింపు చేయాలన్నారు. లిటిల్ షెడ్, గోట్ షెడ్డు తదితర పనులు ఉంటాయన్నారు.