CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఆలయంలోని మరగదాంబికా అమ్మవారు 9 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిస్తారన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు.