CTR: పలమనేరు రూరల్ మండల పరిధిలోని కొలమాసనపల్లి గొల్లపల్లిలో నిర్వహిస్తున్న గంగ జాతరకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సోమవారం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ సర్పంచ్ వెంకటరత్నం, సెల్వరాజ్, తదితరులు ఉన్నారు.