కృష్ణా: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో గల 10 సెంట్ల స్థలం మాదంటే మాదంటూ మంగళవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓవర్గం కాళ్లు లేని వికలాంగులకు కేటాయించిదంటూ, మరో వర్గం కళ్లు లేని వారిదంటూ ఘర్షణకు దిగారు. కాళ్లు లేని వికలాంగులు స్థానికుల అండదండలతో గుడ్డివారికి అన్యాయం చేస్తున్నారని మరో వర్గం ఆవేదన చెందారు.