సత్యసాయి: పెనుకొండలోని దుద్దేబండ గ్రామంలో నిన్నటి రాత్రి భారీ ఉరములు, మెరుపులతో కూడిన వర్షానికి బోయ నారాయణప్పకు చెందిన గుడిసెపై పిడుగుపడి దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత సోమవారం SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు నాగార్జున, రామాంజనేయులు, తదితరులు ఉన్నారు.