NLR: జులై 30లోగా సర్వంగా సుందరంగా పొదలకూరు రోడ్డును తీర్చిదిద్దుతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. సోమవారం నెల్లూరు రూరల్ 32వ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ సెంటర్లో రూ. 36 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.