తిరుపతి: సూళ్లూరుపేటలో ఇటీవల ప్రారంభమైన షాపింగ్ మాల్లో 20 మందికి పైగా ఉద్యోగస్తులను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించారు. దీంతో బాధిత ఉద్యోగస్తులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం షాపింగ్ మాల్ ముందు నిరసన చేపట్టారు. తమ ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలని కోరారు. అయితే తొలగింపునకు కారణాలు తెలియాల్సి ఉంది.