KKD: రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. మద్యం తాగి జగదీశ్ అనే సీనియర్ విద్యార్థి పది మంది జూనియర్లను కారిడార్లోకి తీసుకొచ్చి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో వారు తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం హౌస్ సర్జన్ జగదీశ్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేసి, రూ.25 వేలు అపరాధ రుసుం విధించింది.