ATP: తాడిపత్రిలో జరుగుతున్న ఇంటింటికీ తిరుప్పావై కార్యక్రమం 26వ రోజుకు చేరుకుంది. రవీంద్రనాథ్, భారతి ఆధ్వర్యంలో శ్రీ రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవార్ల ఉత్సవం కనులపండువగా సాగింది. వేలాది దీపకాంతుల నడుమ స్వామివారు, అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.