PLD: సీఎం చంద్రబాబు తలపెట్టిన స్వర్ణాంధ్రప్రదేశ్ సంకల్పానికి నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ నాందిగా చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చిన బడ్జెట్‌పై ఆయన ప్రకటన విడుదల చేశారు. అన్ని రంగాలకు ప్రాధాన్యతా క్రమంలో భారీగా నిధులు ఇచ్చారని, వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారన్నారు.