W.G: ఆకివీడులో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచే భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. దీంతో జాతీయ రహదారిపై కూడా జనసంచారం తగ్గింది. రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నా ఆకివీడులో మాత్రం వాతావరణం పొడిగానే ఉంది.