KRNL: టాటా సన్స్ గ్రూప్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ను మంత్రి టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఓ విలువైన వ్యక్తిని కలవడం స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నట్లు మంత్రి భరత్ పేర్కొన్నారు. ఆయన పంచుకునే జ్ఞానం తనను నిరంతరం ఆకట్టుకుంటోందని కొనియాడారు. వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు నిజంగా కట్టుబడి ఉన్న వ్యక్తిని కలుసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు.