ATP: రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు తెలిపారు. పదుల సంఖ్యలో కంపెనీలు ఈ మేళాకు హాజరవుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పది నుండి పీజీ వరకు చదివిన వారు అర్హులన్నారు. పూర్తి వివరాలకు నేరుగా కళాశాలలో సంప్రదించాలన్నారు.