సత్యసాయి: కదిరిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్నాయి. స్వామి మత్య, కూర్మ, నృసింహ తదితర అవతారాలలో దర్శనం ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. విజయదశమి రోజున అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తామని, భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.