NLR: మర్రిపాడు మండల పరిధిలోని కృష్ణాపురంలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీ ఏర్పడిన సీట్లకు ఈనెల 9వ తేదీ గడువు ముగిసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని నవోదయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.