ASR: ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ శెట్టి నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం పాడేరులోని గిరిజన భవన్లో పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల ఏఎన్ఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 15వ తేదీన తలపెట్టిన ఐటీడీఏ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.