అనంతపురం: తాడిపత్రి అర్బన్ పోలీసులు మట్కాపై ఉక్కుపాదం మోపారు. తాడిపత్రిలోని గాంధీకట్ట, శివాలయం ప్రాంతాలలో మట్కా రాస్తున్నట్లు సమాచారం అందడంతో అర్బన్ సీఐ శ్రీ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 14 మంది మట్కా రాయుళ్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 2.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.