VZM: రామభద్రపురం మండలంలోని రావివలసలో గొర్లె లక్ష్మి రెండు ఎకరాల పొలంలో కోసిన వరిని గుర్తు తెలియని దుండగులు అగ్నికి ఆహుతి చేశారని ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపకుడు లక్ష్మినాయుడు ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కష్టపడి పండించిన ధాన్యం ఇలా నాశనం కావడం బాధాకరమన్నారు. ఘటనపై రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా విచారణ చేయాలన్నారు.